జేపీ నడ్డా ఏపీ పర్యటన ఖరారు.. వివరాలివే!

-

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. జూన్ 6, 7వ తేదీల్లో ఏపీలో పర్యటిస్తున్నట్లు బీజేపీ కార్యవర్గం వెల్లడించింది. ఈ మేరకు పర్యటన వివరాలను వెల్లడించింది. జూన్ 6వ తేదీన విజయవాడకు చేరుకుంటారని, అక్కడ రాష్ట్ర స్థాయి శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్ లతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. అనంతరం సాయంత్రం వేళ.. నగరంలోని పలువురు ప్రముఖులు, మేధావులతో సమావేశం కానున్నారు.

జేపీ నడ్డా
జేపీ నడ్డా

అలాగే జూన్ 7వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సమావేశానికి హాజరు కానున్నారు. ఏపీ రాజకీయాలు, బీజేపీ కీలక నిర్ణయాలపై మాట్లాడనున్నట్లు సమాచారం. అలాగే వివిధ రంగాల ప్రముఖులతో చర్చించనున్నారు. అయితే ప్రధాని మోదీ అధికారంలో వచ్చి ఎనిమిదేళ్లు పూర్తైంది. దీంతో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జేపీ నడ్డా, ఇతర బీజేపీ నేతలు వివిధ రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అలాగే వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచి దక్షిణ రాష్ట్రాలపై బీజేపీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలకు జాతీయ స్థాయి నేతలు హాజరవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news