తుది దశకు ‘రంగ మార్తాండ’..మెరుగులు దిద్దుతున్న కృష్ణవంశీ!

-

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ మార్తాండ’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరాఠి సూపర్ హిట్ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు.

నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ, కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కాగా, ఇటీవల కాలంలో కృష్ణవంశీ ఈ సినిమాకు సంబందించిన అప్ డేట్స్ ట్వి్ట్టర్ వేదికగా రెగ్యులర్ గా ఇస్తున్నారు.

సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమాకు తుది మెరుగులు దిద్దే పనిలో డైరెక్టర్ ఉన్నట్లు సమాచారం. తాజాగా ట్విట్టర్ వేదికగా పద్మశ్రీ బ్రహ్మానందం డబ్బింగ్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నదని తెలిపారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా విడుదల తేదీని త్వరలో మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news