గుడ్ న్యూస్.. త్వరలోనే ఇండియా లోకి టిక్ టాక్ యాప్..

-

వావ్.. ఇది నిజంగా అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి..గత రెండేళ్ల క్రితం ఈ యాప్ ఎంత ఫెమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకూ అందరూ ఏదొక వీడియో చేస్తూ రచ్చ చేస్తున్నారు. కరోనా వ్యాప్థి చెందుతున్న నేపథ్యంలో చైనా యాప్ లను కూడా భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది.దాంతో అప్పటికి మనదగ్గర వేలాది సంఖ్యలో పాపులర్ అయినటువంటి టిక్ టాక్ క్రియేటర్లు డీలా పడిపోయారు.టిక్ టాక్ అనేది చైనాకు సంబంధించిన యాప్ కావడంతో జాతీయ భద్రత సమస్యల దృష్ట్యా భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ను బ్యాన్ చేయవలసి వచ్చింది.

 

ఇప్పుడు మళ్ళీ టిక్ టాక్ మళ్లీ ఇండియాకు వస్తుందంటూ వార్తలు వస్తూనే ఉన్నప్పటికీ, క్రియేటర్ల ఆశలు అడియాశలే అయ్యాయి. ఈ నేపథ్యంలో టిక్ టాక్ యాజమాన్యం తాజాగా ఇండియాలో మళ్ళీ పనిచేసే దిశగా కసరత్తులు చేస్తున్న విషయాన్ని తెలియజేశాయి. ఈ క్రమంలో టిక్ టాక్ యజమానులు ఇండియాలో కొత్త భాగస్వాముల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

టిక్ టాక్ యాజమాన్యం ఆమోదం కోసం ప్రయత్నిచినప్పుడు వారి అభ్యర్థనను పరిశీలిస్తామని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారని తెలిసింది. అయితే, చైనాతో సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యల వలన చైనీస్‌తో నడిచే యాప్‌ను భారత్‌లో రీలాంచ్ చేయడానికి భారత ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న అని చెప్పుకోవచ్చు..ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది టిక్ టాక్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.మరి ఎప్పుడూ ఇండియాలో రీ లాంచ్ చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా ఈ యాప్ మళ్ళీ రీ లాంచ్ అయితే ఎన్ని ఘొరాలు చూడాలో అని కొందరు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news