జూన్ 6 సోమవారం ఆ రాశుల వారికి వస్తూ, ధనలాభం..

-

మేషం
ఈ రొజు ఆదాయం అంతగా ఉండదు. ఆలోచనలు కార్యరూపం దాల్చవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి..దూర ప్రయాణాలు పోస్ట్ ఫోన్ అవుతాయి.

వృషభం
ఖర్చులు అధికంగా ఉంటాయి.ముఖ్యమైన పనులు, కార్యక్రమాలలో ఆటంకాలు. భూవివాదాలు నెలకొంటాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు..కొత్త పనులు మొదలు పెట్టక పోవడం మంచిది.

మిథునం
బంధువుల నుంచి శుభవార్తలు. కుటుంబంలో ప్రోత్సాహం. అదనపు రాబడి ఉంటుంది. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు..ప్రశంసలు.. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి..

కర్కాటకం

కొత్త రుణ ప్రయత్నం చేస్తారు. దూరప్రయాణాలు ఉంటాయి. సోదరులు, మిత్రులతో వైరం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు..ఆలొచించి అడుగు వెయ్యడం మంచిది.

సింహం

శత్రువులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు అమలు చేస్తారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. పోటీపరీక్షల్లో విజయం. ఉద్యోగ విధుల్లో ప్రశంసలు. వ్యాపారాలలో నూతనోత్సాహం..మంచి అదాయాన్ని పొందే అవకాశం..ఈరోజు మంచి రోజు..

కన్య

కుటుంబసమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు. మిత్రులతో విభేదాలు. ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో పని పెరుగుతుంది..జాగ్రత్తగా ఉండాలి.

తుల

ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి.. కార్యజయం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలయాలు దర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పెరుగుతాయి.. ఆర్థిక బాధలు తగ్గుతాయి.

వృశ్చికం

ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇంటాబయటా ఎదురుండదు. పరపతి పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. రాబడి ఆశాజనకం. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి..కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనుస్సు

ముఖ్యమైన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం తగ్గుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు

మకరం

ప్రయాణాలలో అవరోధాలు. కొన్ని కార్యక్రమాలు మధ్యలో ఆగిపోతాయి. కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో నిరాశాజనకమే..ఈరోజు ప్రయాణాలు మంచివి కావు..

కుంభం

యత్నకార్యసిద్ధి. అందర్నీ మాటలతో ఆకట్టుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి..

మీనం

ఆదాయం పెరిగి రుణాలు తీరుస్తారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో శ్రమాధిక్యం..కొత్త పనులు చేస్తారు.. మంచి ఫలితాలు అందుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news