ఎల్‌ఈడీ లైట్ల వెలుగులో ఆఫ్‌ సీజన్‌లోనూ అదనపు దిగుబడి సాధించిన యువ రైతు..

-

ఇప్పుడు పంటలను పండించడంలో కొత్త పద్దతులను పాటిస్తూ అద్భుతాలను సృష్టిస్తున్న రైతులు చాలా మంది ఉన్నారు..అందులోనూ ప్రజల ఆరొగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అరుదైన పంటలను పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు..తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు వేగంగా విస్తరిస్తుండగా, ప్రస్తుతం తెలంగాణలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సుమారు 700 ఎకరాల్లో సాగవుతున్నట్లు అంచనా.

 

విషయాన్నికొస్తే..సంగారెడ్డి జిల్లా రంజోల్‌ గ్రామానికి చెందిన యువరైతు బి.రమేశ్‌రెడ్డి తన తండ్రి నర్సింహ్మరెడ్డి ప్రోత్సహంతో డ్రాగన్‌ ఫూట్‌ను రెండెకరాల్లో సాగు చేస్తున్నారు. తొలి ఏడాది ఎకరానికి రూ. 6 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది. అయినప్పటికీ, సుమారు 30 ఏళ్లపాటు అధిక లాభాలనిస్తుంది.రెండో ఏడాది అయితే ఎకరాకు లక్షకు పైగా ఖర్చు ఉంటుందని అంటున్నారు.2016లో మహారాష్ట్రకు ని ఔరంగ్‌బాద్‌కు వెళ్లి 8 మొక్కలు తెచ్చి ప్రయోగాత్మకంగా నాటారు. మొక్కలు ఏపుగా పెరిగి మంచి కాపు వచ్చింది. ఈ అనుభవంతో మూడేళ్ల క్రితం రెండు ఎకరాల్లో పంట వేశారు. మెరోగన్‌ రెడ్‌ రకానికి చెందిన ఒక్కో మొక్క రూ. 70 చొప్పున 2 వేల మొక్కలు నాటారు. తండ్రి సాగుచేస్తున్న అల్లం, అరటి, చెరకు పంటల వల్ల లాభాలు అంతగా రావటం లేదని భావించి డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు వైపు అడుగులు వేశారు.

పంట సాగు చేసిన మొదటి సంవత్సరంలోనే ఎకరాకు ఒకటిన్నర టన్నుల దిగుబడి వచ్చింది. రెండో సంవత్సరం 5 టన్నులు వచ్చింది. మొదటి సంవత్సరం టన్నుకు రూ. 1.5 లక్షల ధర పలికింది. పెట్టుబడులు పోగా మొదటి ఏడాదిలోనే ఎకరానికి రూ. 10 లక్షల ఆదాయం వచ్చిందని, ఒకసారి 50 వేల పెట్టుపడి పెట్టి పంటను మొదలు పెడితే 20 ముప్పై ఏళ్ళ వరకూ పంట వస్తుందని చెబుతున్నారు.జూన్‌ నుంచి నవంబర్‌ వరకు 45 రోజులకో దఫా డ్రాగన్‌ పండ్ల దిగుబడి వస్తుంది. ఆర్నెల్లకోసారి పశువుల ఎరువు, ఎన్‌పికె, సూక్ష్మపోషకాలు అందిస్తున్నారు. రెండు ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటలో 100 ఎల్‌ఈడీ బల్పులను ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ. 2 లక్షలు ఖర్చు చేశారు. సీజన్ ను బట్టి వెలుతురును ఇస్తున్నారు.

ఎల్లోవైట్‌ తీపిగా ఉంటుందని, ఇదే ఖరీదైన పండన్నారు. నాలుగు నెలకు ఒకసారి పండ్ల దిగుబడి వస్తుందని, కిలో ధర రూ. 1000 నుంచి రూ. 1200 వరకు పలుకుతుందన్నారు..ఈ పంటకు కావాల్సింది వ్యక్తిగత శ్రద్ద అవసరం..వ్యవసాయ నిపునుల సలహా పాటిస్తే ఇంకాస్త మెరుగైన దిగుబడి వస్తుందని అంటున్నారు.. కేవలం పంట మాత్రమే కాదు.తెలుగు రాష్ట్రాల లో 300 ఎకరాలకు డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలను కూడా అందించినట్లు చెప్పారు.తెలుగు రాష్ట్రాల లో యువతకు ఆదర్శంగా నిలిచాడు..

Read more RELATED
Recommended to you

Latest news