సెక్షన్ 8 ప్రకారం తెలంగాణ గవర్నర్ పాలన పెట్టొచ్చు అని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా దర్బార్ మంచిదేనని.. రాష్ట్రం లో గవర్నర్ రూల్ పెడితే ఇంకా మంచిదన్నారు. ఎట్లాగూ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన లేదు కదా..? సమస్యలు చెప్పుకోవడానికి ఎవరో ఒకరు ఉన్నారు కదా అని పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రభుత్వం సచ్చిపోయిందని… మైనర్ బాలిక మీద దాడులు జరుగుతుంటే సర్కార్ నుండి స్పందనే లేదని నిప్పులు చెరిగారు. గవర్నర్ చేతిలో సెక్షన్ 8 ఉందని.. అవసరం అనుకుంటే ప్రభుత్వాన్ని… తీసి పక్కన పడేయ వచ్చన్నారు.
గవర్నర్ సెక్షన్ 8 ప్రకారం.. అవసరం అనుకుంటే ప్రభుత్వానికి ఆదేశాలు చేయవచ్చని.. గ్రేటర్ పరిధిలో ప్రభుత్వం నే తన పరిధిలోకి తీసుకోవచ్చని వెల్లడించారు. శాంతి భద్రతలు సీఎం పరిదని.. వరుస సంఘటనలు జరుగుతుంటే సీఎం.. డీజీపీ..సీపీ..హోమ్ మంత్రి తో కనీసం సమీక్ష చేయడం లేదని ఆగ్రహించారు. సీఎం కెసిఆర్ సొంత రాజ్యాంగం రాసుకుంటా అంటే ఆయన ఇష్టం.. అధికారం మాత్రమే ఉంటది.. బాధ్యతలు ఉండవు అనుకుంటున్నారని మండిపడ్డారు. బాధ్యతలు లేవని సీఎం అనుకున్నప్పుడు కొన్ని చర్యలు ఉంటాయన్నారు. గవర్నర్.. మోడీకి చెప్పినా.. కెసిఆర్ మాటే..మోడీ, అమిత్ షా వింటారని ఆగ్రహించారు.