Breaking : త్వరలోనే భారత్‌లో 5జీ సేవలు..

-

ఎన్నో ఏండ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ 5జీ స్పెక్ట్ర‌మ్ వేలానికి కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలపడంతో.. భార‌త్‌లో ఎట్ట‌కేల‌కు 5జీ
సేవలు అందుబాటులోకి రానున్నాయి. జూలైలో స్పెక్ట్ర‌మ్ వేలానికి సంబంధించిన ప్ర‌క్రియ మొద‌లుకానుంది. 20 ఏండ్ల వ్యాలిడిటీ క‌లిగిన ఈ స్పెక్ట్ర‌మ్‌ను ద‌క్కించుకునేందుకు టెలికం సంస్థ‌ల‌తో పాటు అమెజాన్‌, టీసీఎస్‌, ఎల్అండ్ టీ వంటి ప్రైవేటు ఎంట‌ర్‌ప్రైజెస్ కూడా బిడ్డింగ్‌కు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.Monetizing 5G will be the challenge for incumbent vendors in 2022

ఈ క్ర‌మంలో 5జీ సేవలు అందుబాటులోకి వ‌స్తే క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటి? స‌మాజంలో ఎలాంటి మార్పులు వ‌స్తాయ‌నే అంశాలు ఒక‌సారి చూద్దాం.. 5జీ.. అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. పైగా రేడియో తరంగాలను సమృద్ధిగా, సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. ‘నెట్‌వర్క్ స్లైసింగ్‌’ అనే ప్రక్రియ ద్వారా సిమ్‌కార్డు అనేక తరంగాలను ఒకేసారి వినియోగించుకుంటుంది. ఇలాంటి మార్పులతో అసాధారణ ఫలితాలు కనిపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news