చైనా దేశం తన మూడు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఫుజియాన్‌ను శుక్రవారం ప్రారంభించింది. దీంతో ఈ కొత్త యుద్ధనౌకను తొలి డ్రోన్ విమాన వాహన నౌకగా అభివర్ణిస్తోంది. ఈ యుద్ధ నౌక మానవరహిత వ్యవస్థలను మోసుకెళ్లగలదు. అలాగే అనేక అత్యాధునిక సదుపాయాలు, నౌకర్యాలను కలిగి ఉంటుంది. దీంతో చైనా తన విస్తరణ విభాగంలో భూ, వాయు, నేవి బలగాల బలాన్ని పెంచుకుంటోంది. చైనా నౌకాదళానికి యుద్ధనౌకలు కూడా జోడిస్తోంది.
కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా ఫుజియాన్ యుద్ధనౌక ప్రారంభం ఆలస్యమైంది. తూర్పు తీర ప్రాంతం ప్రావిన్స్ ఫుజియాన్ పేరు మీదుగా ఈ మూడవ యుద్ధనౌకను ప్రారంభించినట్లు చైనా అధికార మీడియా వెల్లడించింది. ఈ యుద్ధనౌకలో పడవలు, డ్రోన్లు, నీటి అడుగున ఉండే వాహనాలతో సహా 50 మానవ రహిత వ్యవస్థలను మోసుకెళ్లగలదు. అలాగే చైనా తన నౌకాదళాన్ని ఆధునీకికరిస్తోంది.
The third Aircraft Carrier of China has official launched. pic.twitter.com/fMpMEpg67h
— Flaming_wheels (@WheelsFlaming) June 17, 2022
కాగా ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైన్యానికి అధిపతిగా కొనసాగుతున్నారు. తన పదవీకాలంలో నౌకాదళం, వైమానికి దళ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా యుద్ధనౌక ప్రారంభించడంతో అమెరికా, భారత్ ఆందోళనకు గురవుతున్నాయి. కాగా, ఈ యుద్ధనౌకకు సంబంధించిన వీడియోను ఫ్లేమింగ్ వీల్స్ అనే ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.