కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రిపథ్ స్కీంపై దేశ్యాప్తంగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన కారులు వింధ్వంసం సృష్టించిన విషయం తెలిసింది. అయితే ఇప్పటికీ ఆందోళన కారులు రైల్వే స్టేషన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది. అయితే రైల్వే స్టేషన్‌ను పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
అయితే.. సికింద్రాబాద్‌లో నెలకొన్న పరిస్థితులకు కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. అయితే పరిస్థితి అదుపులోకి రావడంతో.. రాత్రి నుంచి యథాతథంగా రైళ్లు నడుస్తాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు తప టికెట్లను క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరంలేదని, కాకపోతే రైళ్ల రాకపోకల్లో కొంత ఆలస్యం ఉంటుందని పేర్కొన్నారు.