Gentleman 2: ‘జెంటిల్ మెన్‌2’ డీఓపీ ఫిక్స్..హీరో ఎవరంటే?

-

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ తొలి సినిమా ‘జెంటిల్ మెన్’కు సీక్వెల్ ను ప్రొడ్యూసర్ కుంజుమోన్ 30 ఏళ్ల తర్వాత తీస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా ఇస్తూ సినిమాపైన అంచనాలను మరింత పెంచుతున్నారు నిర్మాత కుంజుమోన్. సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ నయనతార చక్రవర్తి, సెకండ్ హీరోయిన్ గా ప్రియాలాల్ ను ఫైనల్ చేసిన ప్రొడ్యూసర్..తాజాగా కెమెరామెన్ (డీఓపీ) ఎవరో తెలిపారు.

ఏ.గోకుల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అజయన్ విన్సెంట్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తారని ట్విట్టర్ వేదికగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. జెంటిల్ మెన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సీక్వెల్ సినిమాను విడుదల చేయనున్నారు.

‘జెంటిల్ మెన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన జీనియస్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో RC15 ఫిల్మ్ చేస్తున్నారు. ఈ పిక్చర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. కాగా, ఇక ఈ సీక్వెల్ ఫిల్మ్ ‘జెంటిల్ మెన్ 2’లో హీరోగా ఎవరిని ఫైనల్ చేశారనేది సస్పెన్స్ గా మారింది. త్వరలో హీరోను కూడా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ‘జెంటిల్ మెన్’ సినిమాలో హీరోగా నటించిన యాక్షన్ కింగ్ అర్జున్ నే..ఈ సీక్వెల్ లోనూ హీరోగా తీసుకుంటారో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news