పోకో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అదే Poco C40. ఇది ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఫోన్ ధర, కెమెరా సామర్థ్యం, బ్యాటరీ వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. మరి ఫోన్ రివ్యూ ఎలా ఉందో చూద్దామా..!
Poco C40 ధర ఎంతంటే? :
ఈ స్మార్ట్‌ఫోన్ స్థానికంగా లభించే వివరాలను త్వరలో షేర్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఫోన్ రెండు మెమరీ వేరియంట్‌లతో రానుంది.
3GB RAM 32GB, 4GB RAM, 64GB స్టోరేజీతో వస్తోంది.
ఈ ఫోన్ డివైజ్ బ్లాక్, ఎల్లో, గ్రీన్ మూడు కలర్ల ఆప్షన్లలో వస్తుంది.
ప్రస్తుతం, Poco భారత మార్కెట్లో Poco C31ని రూ.7,499కి విక్రయిస్తోంది.
Poco C40 స్పెసిఫికేషన్స్ :
Poco C40 స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ లెవల్ యూజర్ల కోసం కోసమే రూపొందించారు.
HD+ రిజల్యూషన్‌తో భారీ 6.71-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది.
కొత్త Poco ఫోన్‌లలో అందుబాటులో రీడింగ్ మోడ్ వంటి డిస్‌ప్లే ఫీచర్‌లను యూజర్‌లు పొందవచ్చు.
డిస్ప్లే ప్యానెల్ సులభంగా స్క్రాచ్ ఆప్షన్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంది.
IP52 రేటింగ్ కూడా అందించారు. Poco C40 బిల్డ్ పరంగా ధృడంగా ఉంటుంది.
ఈ డివైజ్ బరువు దాదాపు 204 గ్రాములు. హుడ్ కింద 2.0GHz వరకు ఆక్టా-కోర్ JLQ JR510 SoCతో వచ్చింది.
Qualcomm MediaTek వంటి చిప్ కంపెనీలకు బదులుగా షాంఘై ఆధారిత JLQ నుంచి చిప్‌సెట్ వస్తుంది.
కెమెరా సామర్థ్యం..
వెనుకవైపు, ప్రైమరీ 13-MP కెమెరా 2-MP డెప్త్ సెన్సార్‌తో వచ్చింది. ముందు ప్యానెల్ 5-MP సెల్ఫీ కెమెరాతో వచ్చింది.
30fps Full-HD వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వెనుక కెమెరా మాడ్యూల్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.
Poco C40లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 4G, బ్లూటూత్ 5, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi డ్యూయల్-సిమ్ కార్డ్ స్లాట్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ పైభాగంలో 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. Poco C40 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ప్యాకేజింగ్‌లో 10W అడాప్టర్ మాత్రమే ఉంటుంది.
Poco C40 మొత్తం మూడు రంగులలో రానుంది. వెనుక ప్యానెల్‌లో లార్జ్ రెక్ట్ యాంగ్యులర్ మాడ్యూల్ ఉంటుంది. డ్యూయల్ రియర్ కెమెరాలు, LED ఫ్లాష్ ఉన్నాయి. కెమెరా మాడ్యూల్ Poco M-సిరీస్ నుంచి రిలీజ్ అయింది. Poco బ్రాండింగ్‌ను కలిగి ఉంటుంది. వెనుక ప్యానెల్ మెరుగైన గ్రిప్ కోసం ఫింగర్ ప్రింట్ స్మడ్జ్‌లను లెదర్ షేప్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ లభ్యత వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మొదట్లో ఎంపిక చేసిన మార్కెట్‌లలో మాత్రమే రిలీజ్ అవుతుందట.
-Triveni Buskarowthu