జేఈఈ విద్యార్థుల్లో ఆందోళన..

-

జేఈఈ మెయిన్‌ పరీక్షలపై విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఈ నెల 23 నుంచే మెయిన్‌-1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షలకు ఇంకా అడ్మిట్‌కార్డులు అందుబాటులోకి రాలేదు. సాధారణంగా ఏటా ఈ పరీక్షలకు కనీసం 10 రోజుల ముందుగానే అడ్మిట్‌కార్డులు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు గురువారం నుంచే ప్రారంభం కావలసిన ఈ పరీక్షలకు ఆదివారం రాత్రి దాకా అడ్మిట్‌కార్డులు అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

JEE Mains 2021 75 percent criteria relaxation JEE Advanced 2021 multiple  attempts Ramesh Pokhriyal Nishank | Career News – India TV

మరోవైపు విద్యార్థులు జేఈఈ మెయిన్‌-1 పరీక్ష రాయాల్సిన నగరాల వివరాలను ఈ నెల 14నే అందుబాటులో ఉంచిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) వర్గాలు.. అడ్మిట్‌కార్డు లేనిదే పరీక్షకు అనుమతించబోమని తేల్చిచెప్తున్నారు. దీంతో ఎన్టీఏ నిరుపయోగమైన పనులు చేస్తూ తమ పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నదని తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ పరీక్షల నిర్వహణలో ఎన్టీయే పదేపదే విఫలమవుతున్నది. దీనిపై ఎన్ని విమర్శలు వ్యక్తమైనా ఎన్టీఏ తన వైఫల్యాలను అధిగమించేందుకు ప్రయత్నించడంలేదు.

Read more RELATED
Recommended to you

Latest news