కొల్లాపూర్ పంచాయితీ…కారు దిగేది ఎవరు?

-

కొల్లాపూర్ పంచాయితీ రోజుకో మలుపు తిరుగుతుంది..టీఆర్ఎస్ పార్టీలోని ఆధిపత్య పోరు రోజురోజుకూ ముదురుతుంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మధ్య రగడ తార స్థాయికి చేరుకుంది. ఇక వీరి రచ్చ వల్ల టీఆర్ఎస్ పార్టీకి షాకులు గట్టిగా తగిలేలా ఉన్నాయి…ఇద్దరు కలిసిపోతే పర్లేదు..అలా కాకుండా ఇద్దరు రచ్చ లేపితే పార్టీకి నష్టమే. అయితే ఇద్దరు నేతలు కలవడం అనేది కష్టమే. 2018 ముందు వరకు ఇద్దరు నేతలు వేరు వేరు పార్టీలో ఉంటూ రాజకీయం యుద్ధం చేశారు…కానీ ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటూ రచ్చ లేపుతున్నారు.

2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జూపల్లిపై, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బీరం గెలిచారు. గెలిచాక బీరం టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆ వెంటనే టీఆర్ఎస్ లో రచ్చ మొదలైంది…బీరం-జూపల్లి వర్గాల మధ్య బహిరంగ యుద్ధం నడుస్తోంది. ఇక తాజాగా ఫేస్ టూ ఫేస్ తలపడటానికి సిద్ధమయ్యారు. బహిరంగ చర్చకు సవాల్ చేసుకున్నారు. దీనికి ఇద్దరు నేతలు రెడీ అయ్యారు. పైగా ఎస్పీ పర్మిషన్ ఇవ్వాలని లెటర్లు కూడా రాశారు. అయితే వీరి వార్ కు ఎస్పీ పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు. కానీ వీరి మధ్య వార్ ఆగేలా లేదు.

పైగా ఇటీవల కొల్లాపూర్ కు వచ్చిన కేటీఆర్…డైరక్ట్ జూపల్లి ఇంటికెళ్ళి చర్చలు చేశారు. ఇక ఈ అంశంపై బీరం వర్గం రగిలిపోతుంది. ఇదే క్రమంలో నెక్స్ట్ కొల్లాపూర్ కారు సీటు తమది అంటే తమదని ఇరు వర్గాలు వాదించుకుంటున్నాయి. అయితే ఒకరికి సీటు ఇస్తే మరొకరు ఖచ్చితంగా పార్టీ మారేలా ఉన్నారు. అది కుదరకపోతే పార్టీలో ఉంటుంటే…ఒకరి గెలుపుకు మరొకరు సహకరించే పరిస్తితి ఉండదు. అంటే పరోక్షంగా ఓటమి కోసం కృషి చేస్తారు. అంటే ఎటు చూసిన కొల్లాపూర్ లో కారుకు డ్యామేజ్ జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news