ఈ కథనం సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చకు అనుగుణంగా రాసింది మాత్రమే ! ఇరు వర్గాల వాదనలూ ఇవాళ విభిన్నంగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో జగన్ మాటే నెగ్గుతోంది అన్నదే వాస్తవం. ఆ మాటకు వస్తే చంద్రబాబు మాట మాత్రం కేంద్రం వినిపించుకోవడం లేదు అని కూడా తెలుస్తోంది. రాజధాని నుంచి రాష్ట్రపతి వరకూ అన్నింటా నెగ్గింది, నెగ్గుకు వస్తున్నది జగనే!
రెండు విషయాల్లో బాబు ను దాటి జగన్ విజయాలు సాధించారు. ఒకటి రాష్ట్రపతి అభ్యర్థిత్వంకు సంబంధించి, రెండు రాజధాని విషయం గురించి. రాజధాని గురించి ఇప్పటికిప్పుడు లక్ష కోట్లు ఖర్చు చేయలేం అని చెప్పేశారు ఆయన. ఆ విధంగా టీడీపీకి ఝలక్ ఇచ్చారు. ఇక్కడి భూముల అభివృద్ధిపై కూడా కోర్టు డెడ్ లైన్ విధించేందుకు వీల్లేదని చెప్పేశారు ఆయన. అంటే మళ్లీ రాజధాని రైతుల ఉద్యమం సాగితే తప్ప ఇక్కడ పనులలో కదలిక రాదని తేలిపోయింది.
కానీ రాజధాని రైతులు మళ్లీ ఉద్యమం చేసే కన్నా తమ భూములను ప్రభుత్వం నుంచి తిరిగి తీసుకుంటే మేలు అన్న ఆలోచనకు వచ్చేశారు అని కూడా తెలుస్తోంది. కానీ కోర్టు నిబంధనలు ఇందుకు ఒప్పుకోవు. ఒక్కసారి ఏ ప్రయోజనం కోరి ఇచ్చారో వాటికే ఆ భూములు వాడుకోవాలి. అంతేకానీ వాటిని రైతులకు తిరిగి ఇచ్చే ఛాన్స్ లేనే లేదు. కనుక ఎన్నికల ముందు వరకూ అమరావతి పనుల్లో కదలిక రాదు అని తేలిపోయాక జగన్ మాటే నెగ్గిపోయాక ఇక టీడీపీ చేసేందేముందని?
ఇక్కడ కూడా జగన్ స ర్కారే బాబుపై పై చేయి సాధించింది. ఇక ఆఖ రుగా రాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలోనూ టీడీపీ మాట నెగ్గలేదు. టీడీపీ వర్గాలు అంతా అనుకున్న విధంగా కాకుండా తెరపైకి ద్రౌపదీ ముర్మూ అనే ఒడిశా టీచరమ్మ పేరు వచ్చింది. ఇక్కడ కూడా జగన్ మాటే నెగ్గింది కొంత ! అందుకే బాబు మరోసారి ఆలోచించాలి. పిల్లాడయిన జగన్ తనను ఏ విధంగా సాధించి పై కొస్తున్నాడు అన్నది ! పరిశీలకుల మాట