Breaking : దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల.. అప్లై చేసుకొండిలా..

-

డిగ్రీపలో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్‌ నోటిఫికేషన్‌ను హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి అధికారులు బుధవారం విడుదల చేశారు. మొదటి విడత రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు జూలై 1 నుంచి 30 వరకు అవకాశం ఇవ్వగా.. దీనికి జూలై 6 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 6న సీట్లు కేటాయించనున్నారు. ఆగస్టు 7 నుంచి 18 వరకు విద్యార్థులు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని, రెండో విడత ఆగస్టు 7 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ ఇచ్చారు అధికారులు. దీనికి ఆగస్టు 22న సీట్లు కేటాయించనున్నారు. మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లకు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు అవకాశం ఇచ్చారు అధికారులు. వీటికి సీట్లను సెప్టెంబర్ 16న కేటాయించనునట్లు నోటిఫికేషన్లో అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి క్లాస్ లు ప్రారంభం కానున్నాయి.

TS DOST 2022: ఇంటర్‌ విద్యార్థులకు అలెర్ట్‌.. డిగ్రీ అడ్మిషన్ల కోసం నేడు  దోస్త్‌ నోటిఫికేషన్‌.. రిజిస్ట్రేషన్‌ చేసుకోండిలా.. | TS Dost 2022  notification releasing ...

ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఆయా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందేందుకు దోస్త్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దోస్త్ నోటిఫికేషన్ ద్వారా మహాత్మాగాంధీ యూనివర్సిటీ, ఉస్మానియా, కాకతీయ,శాతవాహన, పాలమూరు యూనివర్సిటీల పరిధిలోని 1060 కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు అధికారులు. సీట్ అలాట్ మెంట్ అనేది మూడు విడతల్లో జరగనుంది. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు ఇచ్చే వెబ్ ఆప్షన్ల ఆధారంగా భర్తీ ప్రక్రియ జరుగనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news