మోదీ డైరక్షన్: కారుకు చెక్ పెట్టేలా కమలం ఎత్తు..!

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది…ఇప్పటికే రెండు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి వచ్చింది. అసలు ప్రధాని హోదాలో మోదీ హైదరాబాద్ లో అడుగుపెట్టిన సీఎం హోదాలో కేసీఆర్ స్వాగతం పలకని స్టేజ్ కు..టీఆర్ఎస్-బీజేపీల మధ్యపోరు వెళ్లింది. ఇక తాజాగా ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగగా, మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ లోని జలవివాహర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేసీఆర్…ఓ రేంజ్ లో మోదీపై ఫైర్ అయ్యారు.

మోదీ వల్ల దేశం నాశనమైపోతుందనే కోణంలో విమర్శలు చేశారు..దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీకి సవాల్ చేశారు. అలాగే కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని తాము కూలుస్తామని కేసీఆర్ ఛాలెంజ్ చేశారు. ఇక కేసీఆర్ కు…బీజేపీ నేతలు కూడా కౌంటర్లు ఇచ్చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ…కేసీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

ఇలా రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది…ఇలా మాటల యుద్ధం చేస్తూనే…మరో వైపు కమలదళం..రాష్ట్రంలో సంస్థాగతంగా ఎలా బలపడటమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. ప్రధాని మోదీ డైరక్షన్ లో తెలంగాణలో పార్టీ ఎలా బలపడాలనే అంశంపై బీజేపీ నేతలకు దిశానిర్దేశం జరిగింది.

సంస్థాగత బలమే గెలుపు మంత్రం. సంస్థాగతంగా బలోపేతమైతే ఎన్నికల్లో గెలుపు అదే వస్తుందని తెలంగాణ బీజేపీ నేతలకు మోదీ కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో నేతలంతా జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లోనూ బృందాలుగా విడిపోయి రోజంతా ప్రజల మధ్య గడపాలని, రోజుకు ఒక జిల్లా చొప్పున ఎంచుకుని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతల పర్యటనలు జరపాలని సూచించారు. అంటే కింది స్థాయి నుంచి ప్రజలని తమవైపు తిప్పుకుంటే బీజేపీకి తిరుగుండదని మోదీ చెప్పుకొచ్చారు. మరి మోదీ డైరక్షన్ లో బీజేపీ నేతలు…క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి పార్టీని బలోపేతం చేసి…టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెడతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news