ఇంటికో ఉద్యోగం అనేది బోగస్ మాట – టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

-

టీఆర్‌ఎస్‌ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటికో ఉద్యోగం అనేది బోగస్ మాట అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు టీఆర్‌ఎస్‌ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఇంటికో ఉద్యోగం అనేది ఎవరితో కాదు, చేయడానికి అవకాశం లేదని తేల్చి చెప్పారు. కోటి ఇండ్లు ఉంటే.. కోటి ఉద్యోగా లు ఇవ్వగలమా..అని ప్రశ్నించారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తా అని కేంద్రపార్టీలు డిక్లేర్ చేస్తే.. తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని అప్పగిస్తామని స్పష్టం చేశారు టీఆర్‌ఎస్‌ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ప్రతి పక్షాలకు ఎక్కడా పనిలేక.. విమర్శలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని.. నిరుద్యోగులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా…ఇంటికో ఉద్యోగం అనేది బోగస్ మాట అనే వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news