ప్రైవేట్‌ దేవాలయాలకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

-

ప్రైవేట్‌ దేవాలయాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి నివాసంలో నిర్వహించిన బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందని, ఆషాఢ బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

ప్రైవేట్ ఆలయాలకు సైతం ఆర్థిక సాయం : మంత్రి తలసాని

ఈ నెల 17 న జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర, 24 న జరిగే హైదరాబాద్ బోనాలకు సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గతంలో అంబారీ ఊరేగింపు ఖర్చును ఆయా దేవాలయాలు భరించేవని, ఇప్పుడు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news