మరోసారి సీఎం కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ లేఖ రాశారు. ఈ లేఖలో.. ఈ నెల 15 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. గిరిజనులకు పట్టాలు ఇస్తామన్న హామీలను నిలుపుకోవాలని, పోడు భూములకు పట్టాలపై తాము చేసిన పోరాటాల వల్లే ప్రభుత్వం 2021 నవంబర్ లో గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించిందన్నారు బండి సంజయ్.
అయితే ఇప్పటికే సమస్యలకు పూర్తి పరిష్కారం లభించలేదని, 2018 నవంబర్ 23న మహబూబాబాద్ బహిరంగ సభలో అవసరమైతే కుర్చీలు వేసుకొని మరీ పోడు రైతులకు పట్టాలు ఇస్తామన్న కేసీఆర్ హామీని గుర్తు చేశారు బండి సంజయ్. పట్టాలు ఇస్తామంటే, కుర్చీలు ఏర్పాటు చేయడానికి బీజేపీ, గిరిజనులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు బండి సంజయ్. పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి వీలుగా రెవెన్యూ సదస్సుల్లో రెవెన్యూ అధికారులతో పాటు ఫారెస్ట్ అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు బండి సంజయ్.