బండి సంజ‌య్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 11వ తేదీన అంటే నిన్న.. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఇతరులు అందరూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే… ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖర రావు కూడా… బండి సంజయ్ కుమార్ కు… పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.”మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను”అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు సీఎం కేసీఆర్. అయితే సీఎం కేసీఆర్ బండి సంజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలపడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ కొత్త చర్చకు తెరలేసింది. బద్ధ శత్రువులైన వీరిద్దరి మధ్య ఇలాంటి అనుబంధాలు ఉన్నాయా…? అని అందరూ అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news