మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిథుల కోసం పసందైన వంటలను వండి వడ్డించనున్నారు. ఎప్పటికీ ఈ ఆతిథ్యం గుర్తుండిపోయేలా పలు వెరైటీ వంటకాలను ఈ కార్యక్రమంలో అతిథులకు వడ్డించనున్నారట.
దేశ వ్యాప్త సార్వత్రిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాగా, మోదీ రెండో సారి ప్రధానిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోదీ ప్రమాణ స్వీకారానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ రాత్రి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 7 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన అతిథులు సుమారుగా 6వేల మంది హాజరు కానున్నారని తెలిసింది. వారి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీఎంవో వర్గాలు వెల్లడించాయి.
మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిథుల కోసం పసందైన వంటలను వండి వడ్డించనున్నారు. ఎప్పటికీ ఈ ఆతిథ్యం గుర్తుండిపోయేలా పలు వెరైటీ వంటకాలను ఈ కార్యక్రమంలో అతిథులకు వడ్డించనున్నారట. అందులో భాగంగానే మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు అతిథులకు టీ, సమోసా, శాండ్ విచ్, లెమన్ టార్ట్ వంటి స్నాక్స్ ఇస్తారట. ఆ తరువాత బెంగాలీ స్వీట్ రాజ్‌భోగ్ (రసగుల్లా లాంటి స్వీట్) ను పెడతారట. ఇక రాత్రి డిన్నర్‌లో పలు వెజ్, నాన్‌వెజ్ వంటకాలను అతిథులకు వడ్డిస్తారట.
మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం జరిగే డిన్నర్‌లో అతిథులకు రాష్ట్రపతి భవన్ పాపులర్ వంటకమైన దాల్ రైసినాను కూడా వడ్డించనున్నారట. దీన్ని మినపగుళ్లతో తయారు చేస్తారు. ఈ వంటకాన్ని సన్నని మంటపై సుమారుగా 48 గంటల పాటు వండుతారు. దీంతోపాటు చికెన్, ఫిష్, ప్రాన్స్‌తో పలు వెరైటీ వంటకాలను కూడా అతిథులకు వడ్డించనున్నారు.