ఎన్టీఆర్ అడ్డాలో ‘సైకిల్’కు ఫస్ట్ ఛాన్స్!

-

ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు గ్రామం అని అందరికీ తెలిసిందే…అయితే ఆ గ్రామం పామర్రు పరిధిలో ఉంది…అయితే ఒకప్పుడు పామర్రు సైతం…గుడివాడ నియోజకవర్గంలో ఉండేది..అందుకే ఎన్టీఆర్ గుడివాడలో పోటీ చేసి సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. 1983, 1985 ఎన్నికల్లో గుడివాడ బరిలో దిగి ఎన్టీఆర్ విజయాలు అందుకున్నారు…అలాగే సీఎంగా రాష్ట్రాన్ని పాలించారు. ఇక తర్వాత గుడివాడలో ఎన్టీఆర్ బరిలో దిగకపోయినా టీడీపీ మంచి విజయాలు సాధిస్తూ వచ్చింది. ఒక్క 1989లోనే ఓడిపోగా, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచింది. ఇక తర్వాత కొడాలి నాని దెబ్బకు 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వచ్చింది.

అయితే 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన విషయం తెలిసిందే..దీంతో గుడివాడ నుంచి పామర్రు సెపరేట్ అయింది…పామర్రు నియోజకవర్గంగా మారింది. దీంతో ఎన్టీఆర్ పుట్టిన గ్రామం నిమ్మకూరు..పామర్రు పరిధిలో ఉండిపోయింది. ఇక 2009, 2014, 2019 ఎన్నికల్లో పామర్రుకు ఎన్నికలు జరిగాయి…కానీ ఒక్కసారి కూడా పామర్రులో టీడీపీ గెలవలేదు. ఎన్టీఆర్ పుట్టిన వూరులో టీడీపీ చిత్తుగా ఓడిపోతుందని, ఈ మధ్య కొడాలి నాని వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడారు.

ఎన్టీఆర్ గడ్డపైనే టీడీపీని చంద్రబాబు గెలిపించుకోలేకపోతున్నారని, ఇంకా జగన్ కు ఏం చెక్ పెడతారని కౌంటర్ ఇచ్చారు. అయితే కొడాలి చెప్పింది వాస్తవమే…ఇంతవరకు పామర్రులో టీడీపీ గెలవలేదు…2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇక 2019లో జిల్లాలోనే వైసీపీకి అత్యధిక మెజారిటీ వచ్చింది పామర్రులోనే. అంటే ఎన్టీఆర్ పుట్టిన గడ్డపై వైసీపీ సత్తా చాటుతుంది.

అయితే ఈ సారి వైసీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని టీడీపీ ప్రయత్నిస్తుంది. ఈ సారి ఎలాగైనా పామర్రులో పసుపు జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఎలాగో స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై నెగిటివ్ పెరుగుతుంది…అలాగే కొత్తగా టీడీపీ ఇంచార్జ్ గా వచ్చిన వర్ల రామయ్య తనయుడు వర్ల కుమార్ రాజా సైతం దూకుడుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పామర్రులో టీడీపీ పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పామర్రులో గెలిచే ఫస్ట్ ఛాన్స్ వచ్చేలా ఉంది. చూడాలి మరి కొడాలి మాటలకు చెక్ పెడుతూ…పామర్రులో టీడీపీ గెలుస్తుందో లేక…మళ్ళీ చతికలపడుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news