BIG BREAKING : కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలుగురు కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లగా.. తాజాగా మరో షాక్ తగింది. బీజేపీ లో చేరేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే రెండు రోజుల కిందట, ఓ కేంద్ర మంత్రి, అమిత్ షాలతో చర్చలు జరిపారని సమాచారం అందుతోంది.
కేంద్ర బీజేపీ నాయకత్వం నుంచి ఆఫర్ రావడంతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి… బీజేపీ లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారట. అంతేకాదు దీనిపై చర్చించేందుకు ఇవాళ నియోజక వర్గంలో ఓ సమావేశం కూడా నిర్వహించేందుకు సిద్ధం అయ్యారట. కానీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డికి ఇవాళ కాస్త అనారోగ్యంగా ఉండటంతో ఆ సమావేశం రద్దయిందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి.. తన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నట్లయితే కనిపిస్తోంది. ఏ క్షణమైనా గోడ దూకే ఛాన్స్ లేకపోలేదు.