సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం ఈయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది అని చెప్పవచ్చు. ఎందుకంటే జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో పలువురు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత పలు సినిమాలలో బిజీగా ఉన్నాడు అని.. మరికొంతమంది డబ్బు కోసమే ఇతర షోలలో పాల్గొంటున్నాడు అని రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు అనుకున్నట్టుగానే సుదీర్ కూడా స్టార్ మా చానల్లో వస్తున్న పలు ప్రోగ్రామ్లకు హోస్ట్ గా పని చేయడం, ఇక సినిమాలలో గాలోడు వంటి సినిమాతో హీరోగా వస్తూ ఉండడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. ఇక అంతే కాదు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈయనపై ఎన్నో నెగెటివిటీ ప్రచారం జరిగినా ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ప్రోమో విడుదల అవ్వగా.. అందులో సుధీర్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్నట్లు హింట్ కూడా ఇచ్చారు.
ఇక మరి ఈ విషయంపై సుధీర్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇకపోతే జబర్దస్త్ నుంచి చాలామంది కమెడియన్స్ వెళ్లిపోయినప్పటికీ సుధీర్ పేరు ప్రథమంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఆయన ఇండస్ట్రీలోకి రావడానికి ఎలాంటి కష్టాలను అనుభవించాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక మొదట మెజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన సుధీర్, ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక డాన్సర్ గా , యాంకర్ గా, హీరోగా కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న సుధీర్ మొదట్లో అనుకున్నంత ఈజీగా అవకాశాలను అందుకోలేదు. సీనియర్ కమెడియన్ వేణు సహాయంతో ఇండస్ట్రీలోకి స్క్రిప్ట్ రైటర్ గా అడుగు పెట్టాడు. ఇక అలా ఆ సమయంలో చాలా తక్కువ పారితోషకాన్ని అందుకునే వాడు సుధీర్. స్క్రిప్టు రైటింగ్ కోసం మొదట్లో ఒక ఎపిసోడ్కి రూ.2 వేల నుంచి రూ.3 వేల రూపాయలను మాత్రమే పారితోషకంగా పొందాడు. ఇక ప్రస్తుతం ఈయన రూ.2 లక్షలకు పైగా ఒక ఎపిసోడ్ కి పారితోషికం గా తీసుకుంటున్నట్లు సమాచారం.