రాజగోపాల్ రెడ్డిని మార్చిన రేవంత్ రెడ్డి!

-

రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే పి‌సి‌సి పదవి వచ్చిందో అప్పటినుంచి…కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. ఇందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి…ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లాంటి వారైతే…రేవంత్ పైనే బహిరంగంగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా వారు అడపాదడపా రేవంత్ పై ఫైర్ అవుతూనే వస్తున్నారు. కాకపోతే రేవంత్ పై కోపంతో పలువురు సీనియర్లు పార్టీ మారిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా జరిగింది…కానీ ఆ ప్రచారానికి తగ్గట్టు మాత్రం … సీనియర్లు పార్టీలు మారలేదు.

రేవంత్ పై అసంతృప్తిగా ఉన్నా సరే…కాంగ్రెస్ లోనే పనిచేస్తూ వస్తున్నారు. కానీ అందరు ఒక ఎత్తు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొక ఎత్తు అన్నట్లు రాజకీయం చేస్తూ వస్తున్నారు. 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో పనిచేస్తూ రాలేదు. మొదట్లో కాస్త పార్టీలో కనిపించినా..తర్వాత నుంచి తన పని తాను చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి పి‌సి‌సి పదవి ఇచ్చారో అప్పటినుంచి రాజగోపాల్ పూర్తిగా కాంగ్రెస్ కు దూరం జరిగారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొవడం లేదు. ఏదో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ముందుకెళుతున్నారు.

అయితే ఈయన మధ్య మధ్యలో కాంగ్రెస్ పని అయిపోయిందని, బీజేపీనే టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టగలదని మాట్లాడుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన బీజేపీలోకి వెళ్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతూ వచ్చింది…కానీ ఆయన పార్టీ మారలేదు. ఈ క్రమంలోనే ఆయన..పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నారు…ఇటీవలే అమిత్ షాతో భేటీ అయిన ఆయన..బీజేపీలోకి రావడానికి సిద్ధమయ్యారు.

ఇదే క్రమంలో ఆయన..కేసీఆర్ పై విమర్శలు చేశారు..పనిలో పనిగా రేవంత్ విషయంలో కూడా తన మనసులో మాట బయటపెట్టేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీపై తనకు గౌరవం ఉందని, కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తుల నాయకత్వంలో పనిచేయడం ఇష్టంలేక ఇంట్లో కూర్చున్నానని,  జైలుకు వెళ్లివచ్చిన వారితో తాను నీతులు చెప్పించుకోవాలా? అని రాజగోపాల్ ఫైర్ అయ్యారు.

అంటే రాజగోపాల్ మాటలు బట్టి చూస్తే…రేవంత్ వల్లే తాను కాంగ్రెస్ పార్టీకి దూరమైనట్లు పరోక్షంగా చెప్పుకొచ్చారు. అలాగే రేవంత్ వల్ల కాంగ్రెస్ నాశనమవుతుందనే కోణంలో విమర్శలు చేశారు. టోటల్ గా రాజగోపాల్ పార్టీ మారడానికి కారణం రేవంత్ అన్నట్లు పరిస్తితి వచ్చింది. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డిని రేవంత్ రెడ్డి మార్చారు అనమాట.

Read more RELATED
Recommended to you

Latest news