పెద్ద, పెద్ద తుంపర్ల ద్వారానే మంకీపాక్స్ వ్యాప్తి – తెలంగాణ వైద్యులు

-

పెద్ద పెద్ద తుంపర్ల ద్వారానే మంకీపాక్స్ వ్యాప్తి చెందుతుందని.. గాలి ద్వారా ఈ వైరస్‌ సోకబోదని ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శంకర్ ప్రకటించారు. మంకీపాక్స్ అనుమానిత కేసు నిన్న కామారెడ్డి నుంచి వచ్చిందని.. 6వ తేదీన భాదితుడు కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చారన్నారు. కామారెడ్డిలో పరీక్షలు నిర్వహించాము… బాధితుని మెడ, గొంతు, చేతి, ఛాతీ మీద పొక్కులు కనిపిస్తున్నాయన్నారు.

కరోనా వైరస్-మంకీపాక్స్
కరోనా వైరస్-మంకీపాక్స్

ఐదు రకాల శాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహిస్తామని.. రేపు సాయంత్రం పేషంట్ రిపోర్ట్స్ వస్తాయని వెల్లడించారు. పేషంట్ కుటుంబ సభ్యులు అరుగుర్ని ఐసోలేషన్ లో పెట్టారు. ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి లక్షణాలు లేవని.. కాంటాక్ట్ ట్రెసింగ్ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చేస్తున్నారని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకు జ్వరం వస్తే ఐసోలేషన్ లో ఉండాలి…మంకీ పాక్స్ 6 నుంచి 13 రోజుల తర్వాతనే బయటపడుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news