అనారోగ్యంతో కైకాల.. బర్త్ డే సెలబ్రేట్ చేసిన మెగాస్టార్

-

మెగాస్టార్ చిరంజీవి.. సినిమాల విషయంలోనే స్టార్ కాదు. మంచి మనసుందని చాటుకోవడంలో.. మానవత్వం ఉన్న మనిషని నిరూపించుకోవడంలో ఆయనెప్పుడూ సూపర్ స్టారే. తనతో నటించిన వారిపై ఆయన ఎంతో ప్రేమ చూపిస్తారు. తన కంటే పెద్దవాళ్లని ఎంత గౌరవిస్తారో.. తనకంటే చిన్నవాళ్లతో అంతే ఆప్యాయతగా ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే సాయపడటంలో ముందుంటారు. తనతో నటించిన సీనియర్ నటులను అప్పుడప్పుడు వెళ్లి కలుస్తుంటారు. వారితో వారి కుటుంబంతో కాసేపు గడుపుతారు. ఆనాటి గుర్తులను నెమరువేసుకుని కాసేపు ముచ్చట్లు పెడతారు.

సినిమా పూర్తవ్వడంతోనే తమ బంధం ముగిసిపోలేదని.. తాము బతికున్నంత వరకు ఆప్తమిత్రులమనే భావన వారికి కలగజేస్తుంటారు. తన తోటి నటుల పుట్టిన రోజు, పెళ్లి వేడుకలకు శుభాకాంక్షలు చెబుతుంటారు. వీలైతే వెళ్లి కలిసి ఓ పూలగుచ్ఛం అందించి ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. వేడుకలే కాదు కష్టాల్లో ఉన్నా.. ఆదుకుంటారు.

మెగాస్టార్ చిరంజీవితో చాలా సినిమాల్లో నటించిన వారిలో ఒకరు కైకాల సత్యనారాయణ. అమాయక మామ.. కరుడుగట్టిన విలన్.. ఇలా చాలా పాత్రల్లో మెగాస్టార్ తో దీటుగా నటించి ప్రేక్షకులను అలరించారు. కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేక మంచానపడ్డారు. ఇటీవలే ఆస్పత్రికి వెళ్లి చికిత్స కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్దే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇవాళ కైకాల పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.

కేవలం విషెస్ చెప్పడమే కాదు.. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పుట్టిన రోజు జరిపారు. బెడ్ పైనే కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను మెగాస్టార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘చిరంజీవి సార్.. మీరు నిజంగా మనసున్న మహారాజు’ అంటూ ఫ్యాన్స్ తెగ కమెంట్లు పెడుతున్నారు.

‘పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news