హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో నితిన్. ప్రస్తుతం హీరో నితిన్ “మాచర్ల నియోజకవర్గం” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుండగా.. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై తెరకెక్కుతోంది.“మాచర్ల నియోజకవర్గం” సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి నితిన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ప్రోమో ని రిలీజ్ చేసింది చిత్రం బృందం. పూర్తి ట్రైలర్ ఈనెల 30న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.”నేను సిద్ధం.. మరి మీరు? అంటూ ట్రైలర్ ప్రోమోలో నితిన్ చెప్పిన డైలాగ్ తో సినిమాపై అంచనాలను పెంచేశాయి.ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నేను సిద్ధం..మరి మీరు?
Here's #MacherlaDhamki 👊🏻
TRAILER ON JULY 30th! #MacherlaNiyojakavargam#MNVFromAug12th pic.twitter.com/YNFnL3MNR5
— nithiin (@actor_nithiin) July 26, 2022