ఖమ్మం జిల్లాలో మంకీ పాక్స్ కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్ కి చెందిన సందీప్ అనే వ్యక్తి ఖమ్మం రూరల్ మండలం ఆరంపుల లో గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తీవ్ర జ్వరంతో అతను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రాగా మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నాయని డిహెచ్ఓ కి సమాచారం అందించింది ఆసుపత్రి యాజమాన్యం. దీంతో వెంటనే డిహెచ్ఎంఓ ఆదేశాల మేరకు పేషెంట్ ను హైదరాబాదులోని ఫీవర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా..
కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ లక్షణాలు కలిగిన వ్యక్తికి మంకీపాక్స్ సోకలేదని స్పష్టం చేసింది. పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు అతడి శాంపిల్స్ ను పంపినట్లు తెలిపింది. పరీక్షించిన వైద్యులు.. నెగిటివ్ గా నిర్ధరించినట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రజలు మంకీపాక్స్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు తెలిపారు. ఇది ప్రాణాంతక వ్యాధి కాదని పేర్కొన్నారు.