గుడివాడలో చికోటీతో క్యాసినో ఆడించింది కొడాలి నానినే -టీడీపీ నేత బోడె ప్రసాద్

-

గుడివాడలో చికోటీతో క్యాసినో ఆడించింది కొడాలి నానినేనని ఆరోపణలు చేశారు టీడీపీ నేత బోడె ప్రసాద్. చికోటి ప్రవీణ్ అనే వాడెవడో నాకు తెలీదని.. చికోటితో వైసీపీ నేతలకే సంబంధాలున్నాయన్నారు. నేను ఏ రోజూ పేక ముట్టుకోలేదు.. క్యాసినోకు వెళ్లలేదని.. విదేశాలకు వెళ్లినా ఫ్యామ్లీతోనే వెళ్తానని తెలిపారు. తాను పేకాడతాను.. క్యాసినోకు వెళ్తానని బాలినేని స్వయంగా చెప్పారు… గుడివాడలో చికోటీ ప్రవీణుతో క్యాసినో ఆడించింది కొడాలి నాని అని ఫైర్‌ అయ్యారు.

కంకిపాడులో ఎవడో క్యాసినో పెట్టడానికి ప్రయత్నిస్తే.. దాని వెనుక నేనున్నాననేది అబద్దమని… ఆ వార్తలు వచ్చిన సమయంలో నేను ఆస్ట్రేలియాలో ఉన్నానని తెలిపారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినప్పుడల్లా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ తరహా దుష్ప్రచారం చేయడం వైసీపీకి అలవాటేనని.. అధికారంలో వైసీపీనే ఉంది కదా.. దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలను నిరూపించండని డిమాండ్‌ చేశారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్దసారధి రూ. 350 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డాడు… రాష్ట్రంలో, పెనమలూరులో వైసీపీ పని అయిపోయిందని పేర్కొన్నారు. పడిపోయిన వైసీపీని లేపేందుకు మాపై బురద జల్లుతున్నారని ఆగ్రహించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news