అటవీ శాఖ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి రాజన్న దొర. గిరిజనులు బ్రతకడానికి సహకరించడం లేదని రాజన్న దొర ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ పాత చట్టాలతో గృహాలు, సాగు చేసుకోవడానికి ఆటంకాలు కలిగిస్తున్నారని అన్నారు. అందుకే ఈ మధ్యనే పీసీసీ ఎఫ్ అధికారిని ప్రభుత్వం బదిలీ చేసిందన్నారు. అటవీ భూములు నిరుపయోగంతో ఎవరికి ప్రయోజనం లేదన్నారు.
తన నియోజకవర్గంలో రహదారులకు అటవీశాఖ ఫైల్ సీఎం చెప్పినా అటవీ అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రాజన్న దొర. ప్రధాన్ మాతృ వందన యోజన పథకం కింద గర్భిణీయులకు ఇచ్చే 5 వేలను రెండు విడతలుగా కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మైదాన ప్రాంతాల గిరిజనుల అభివృద్ధికి ఐటీడీఏలను ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.