టీఆర్ఎస్‌ వాళ్లకే దళిత బంధు.. ఇది నిజం : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

-

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన జగిత్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 8 ఏళ్లలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన 86 వేల కోట్లలో 56 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు జీవన్‌ రెడ్డి. దళితబంధు సరే.. ఎస్సీ సబ్ ప్లాన్ మాటేంది? అవే నిధులు దళితుబంధుకు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు జీవన్‌ రెడ్డి. జనాభా ప్రకారం ముగ్గురు దళిత మంత్రులు ఉండాల్సి ఉండగా.. కేవలం ఒక కొప్పులకే మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు జీవన్‌ రెడ్డి.

TPCC President: Jeevan Reddy Is Likely To Be Finalized By Sonia Gandhi

రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ఎన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారో మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు జీవన్‌ రెడ్డి. టీఆర్ఎస్ లీడర్లకు, శ్రేణులకు మాత్రమే దళితబంధు ఇస్తున్నారని ఆరోపించారు జీవన్‌ రెడ్డి. ఇది టీఆర్ఎస్ పార్టీ పథకం కాదని గుర్తుంచుకోవాలన్నారు జీవన్‌ రెడ్డి. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లకు అప్పగించాలి. దశ, దిశ లేకుండా తెచ్చిన దళితబంధు పథకం దేశానికి ఆదర్శమా? అని ప్రశ్నించారు జీవన్‌ రెడ్డి. దళితులకు డబుల్ ఇండ్లు కట్టించి ఇస్తే దేశానికే మీరు ఆదర్శంగా నిలుస్తారని హితవు పలికారు జీవన్‌ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news