తగ్గేదేలే అంటున్న కరోనా.. తెలంగాణలో మళ్లీ భారీగా కొత్త కేసులు..

-

యావత్త ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. దీంతో పాట మంకీపాక్స్‌ రూపంలో మరో వైరస్ ప్రజలకు విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. అయితే.. తాజాగా.. తెలంగాణలో కరోనా వ్యాప్తి పెరుగుతూ, త‌గ్గుతూ సాగుతోంది. బుధ‌వారం రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య 992గా నమోదైంది. గడచిన 24 గంటల్లో 41, 182 కరోనా పరీక్షలు నిర్వహించగా 992 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

New corona variant puts Telangana on high alert

అత్యధికంగా హైదరాబాదులో 376 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 65, కరీంనగర్ జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 54, నల్గొండ జిల్లాలో 37 కేసులు గుర్తించారు. ఇంకా 842 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. అదే సమయంలో 852 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,22,663 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,12,420 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 6,132 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news