మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు.. ఎన్ని కఠిన శిక్షలు వేసినా.. ఎన్ని చట్టాలు చేసినా.. స్త్రీలపై అత్యాచారాలకు ఆగడం లేదు. అయితే.. వర్ధమాన నటి, మోడల్‌ను లైంగిక వేధింపులకు గురిచేసిన షేర్ బ్రోకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఓ హోటల్‌లో పట్టుబడిన షేర్ మార్కెట్ ట్రేడర్ జిగ్నేష్ మెహతాపై అంధేరి ఎంఐడీసీ పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అంధేరి ఎంఐడీసీ ప్రాంతంలోని ఓ హోటల్ గదిలో తనను కలవాలని బాధితురాలిని పిలిచాడు మెహతా. అయితే ఈ నేపథ్యంలో.. తనకు బాలీవుడ్ నిర్మాతలతో పరిచయం ఉందని, తన పరిచయాలతో సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని మహిళకు నమ్మబలికాడు మెహతా.
ఆగస్ట్ 5న హోటల్ రూంలో తనతో డిన్నర్‌కు రావాలని కోరాడు మెహతా. బాధితురాలు హోటల్ రూంకు రాగా నిందితుడు తన స్నేహితుడితో కలిసి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు మెహతా. ఆమె ప్రైవేటు భాగాలపై చేయివేసి.. ఆమె దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు ప్రతిఘటించి సాయం కోసం బిగ్గరగా అరిచింది. దీంతో.. మహిళ అరుపులకు హోటల్ సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను కాపాడారు. మెహతాను పట్టుకున్న హోటల్ సిబ్బంది అతడిని పోలీసులకు అప్పగించారు. ఇలా ఎక్కడ చూసిన తమ కామవాంఛ తీర్చుకోవడానికి వీలైనన్ని అడ్డదారులు తొక్కుతున్నారు దుర్మార్గులు.