టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్..ప్రజెంట్ సినిమా, పాలిటిక్స్ ..రెండూ చేస్తున్నారు. త్వరలో పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొననున్న జనసేనాని పవన్.. ప్రస్తుతం తన రాజకీయ కార్యక్రమాలపైన దృష్టి సారిస్తున్నారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను తన అన్న మెగాస్టార్ చిరంజీవి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో ఇంట్రడ్యూస్ చేశారు.
ఈవీవీ సత్యనారాయణ దర్వకత్వం వహించిన ఈ ఫిల్మ్ తో ఇండస్ట్రీకి పరిచయం అయిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. ఆయన పేరు వినబడితే చాలు ఆనందపడిపోయే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. వెండి తెరపైన ఆయన కనబడితే చాలు.. థియేటర్లు ఊగిపోయేంత అశేష అభిమానులు పవన్ కల్యాణ్ కు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కెరీర్ లో రీమేక్స్ ఎక్కువగానే చేశారు. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘భీమ్లా నాయక్’ కూడా రీమేక్ యే. మాలీవుడ్(మలయాళ) సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా ‘భీమ్లా నాయక్’ వచ్చింది. తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ కూడా రీమేక్ యే. అయితే, ఈ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేశారు మేకర్స్.
బాలీవుడ్ (హిందీ) ఫిల్మ్ ‘ఖయామత్ సే ఖాయామత్ తక్’ సినిమా ఆధారంగా కొన్ని మార్పులు చేసి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కించారు. అలా పవన్ కల్యాణ్ తొలి చిత్రం రీమేక్ యే.. కాగా, తర్వాత కూడా ఆయన పలు రీమేక్ మూవీస్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ పిక్చర్ తర్వాత తన వీరాభిమాని హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ చేయనున్నారు. అయితే, రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో సినిమాలు త్వరగా కంప్లీట్ చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని సమాచారం.