రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల సర్పంచ్‌ల సంఘం అద్యక్షుడు థామస్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు సోమవారం కోళ్లపడకల్ నుంచి పెద్ద గోల్కొండ వరకు రోడ్డును నిర్మించాలని మంత్రిని కలిసి కోరారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ .. టీఆర్‌ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని, గ్రామాలలో దెబ్బతిన్న రోడ్లను దశల వారీగా చేపట్టి పూర్తి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రోడ్డు పనులను చేపట్టాలని ఆర్‌ఆండ్‌బీ అధికారులను ఆదేశించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తుందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సీఎం కేసీఆర్ పాలనలోనే రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు. కార్యక్రమంలో హనుమగల్ల చంద్రయ్య, సర్పంచ్‌లు నారాయణ రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మెగావత్ రాజునాయక్, మోతీలాల్‌నాయక్, స్లీవారెడ్డి, కంది అరుణ, బండారు లావణ్య, మంత్రి సంధ్య, గుత్తి పద్మ తదితరులు పాల్గొన్నారు.