బిగ్ బాస్ 3 ప్రోమో షూట్ లో బిజీబిజీగా నాగార్జున..!

-

బిగ్ బాస్ షో ఇప్పటికే రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్నది. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటి సారి ఓ రియాల్టీ షోకు స్టార్ మాటీవీ తెర లేపింది. హిందీలో ప్రారంభమైన బిగ్ బాస్ షోను రీజనల్ భాషల్లో కూడా ప్రారంభించారు.

మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో తనలోని మరోకోణాన్ని ఆవిష్కరించాడు నాగార్జున. బుల్లి తెరపై కూడా రాణించగలనని నిరూపించాడు. ఆయన హోస్ట్ గా నిర్వహించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో సూపర్ హిట్ అయింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ షోను ఆపేశారు. తర్వాత నాగార్జున బుల్లి తెరకు దూరమయ్యాడు.

మళ్లీ ఇప్పుడు బుల్లి తెర కోసం మేకప్ వేసుకుంటున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కి హోస్ట్ గా నాగార్జునను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మన్మథుడు 2 సినిమాలో నటిస్తున్న నాగార్జున.. ఆ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసేసుకున్నారట. ఈరోజు నుంచి బిగ్ బాస్ కోసమే తన క్యాల్షీట్లు కేటాయించాడట. దీంతో ఇవాళ్టి నుంచి బిగ్ బాస్ 3 ప్రోమో షూటింగ్ తీస్తున్నారట.

బిగ్ బాస్ షో ఇప్పటికే రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్నది. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటి సారి ఓ రియాల్టీ షోకు స్టార్ మాటీవీ తెర లేపింది. హిందీలో ప్రారంభమైన బిగ్ బాస్ షోను రీజనల్ భాషల్లో కూడా ప్రారంభించారు. అలా తెలుగులోనూ ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్ వన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండో సీజన్ ను నాని హోస్ట్ చేశాడు.

తాజాగా.. మూడో సీజన్ కోసం కింగ్ నాగార్జునను తీసుకున్నారు మాటీవీ నిర్వాహకులు. ఇప్పటికే కంటెస్టెంట్లను కూడా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బిగ్ బాస్ 3 ఫస్ట్ లుక్ ను మాటీవీ రిలీజ్ చేసింది. తన ట్విట్టర్ ఖాతాలో ఫస్ట్ లుక్ కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. నాగార్జున షూటింగ్ పూర్తయితే ప్రోమోను కూడా కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news