మాకు కశ్మీర్ వద్దు.. విరాట్ కోహ్లీని ఇవ్వండి చాలు.. పాకిస్థానీయుల విజ్ఞ‌ప్తి

932

భారత్ వరల్డ్ కప్ లో దూసుకుపోవడానికి కారణం ఎవ్వరు అంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనే చెప్పాలి. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ ఎన్నో మ్యాచులను గెలుచుకున్నది.

గత ఆదివారం జరిగిన భారత్, పాక్ మ్యాచ్ చూశారు కదా. భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ను చిత్తు చేశారు. చిత్తుచిత్తుగా ఓడించారు. అంతే కాదు.. భారత్ అప్రతిహతంగా వరల్డ్ కప్ లో దూసుకుపోతోంది. ఇంతకుముందు ఆడిన రెండు మ్యాచుల్లోనూ భారత్ గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను కూడా ఓడించింది భారత్.

అయితే.. భారత్ వరల్డ్ కప్ లో దూసుకుపోవడానికి కారణం ఎవ్వరు అంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనే చెప్పాలి. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ ఎన్నో మ్యాచులను గెలుచుకున్నది. 2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ను గెలుచుకోవాలన్న కసితో ఉంది. విరాట్ కోహ్లీ సారథ్యం అంటేనే ఎదురుండదు. ప్రత్యర్థి ఎవరైనా సరే.. గెలుపు మాత్రం భారత్ దే.

నిన్న జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లోనూ జరిగింది అదే. అందుకే… పాకిస్థానీయులు కూడా తమకు విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్ కావాలని అంటున్నారు. మాకు కశ్మీర్ వద్దు. విరాట్ కోహ్లీని ఇవ్వండి చాలు.. అంటూ పాకిస్థానీయులు ఫ్లెక్సీ పట్టుకున్న నిలబడ్డ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది నిజమా? లేక ఫేక్ ఫోటోనా? అనేది తెలియనప్పటికీ… నిన్నటి మ్యాచ్ తో మాత్రం విరాట్ కోహ్లీకి పాకిస్థానీయులు కూడా ఫ్యాన్స్ అయిపోయారు. విరాట్ కోహ్లీనా మజాకా?