మునుగోడు సిత్రాలు..కమ్యూనిస్టులపై కమలం ప్రేమ!

-

మునుగోడులో గెలవడం కోసం ప్రధాన పార్టీలన్నీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఊహించని ఎత్తుగడలతో రాజకీయం చేస్తున్నాయి. అయితే గెలుపు కోసం సరికొత్త దారులని సైతం ఎంచుకుంటున్నాయి. ముఖ్యంగా మూడు పార్టీలు…కమ్యూనిస్టులకు వల వేయడం చాలా ఇక్కడ సరికొత్త అంశంగా ఉంది.

సాధారణంగా కమ్యూనిస్టులకు..టీఆర్ఎస్ తో గాని, కాంగ్రెస్ తో గాని పొత్తు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి….కానీ బీజేపీకి…కమ్యూనిస్టులు పూర్తిగా దూరంగా ఉంటారు…అటు కమలం పార్టీ అయినా సరే కమ్యూనిస్టులకు దూరమే. మరి అలాంటిది మునుగోడులో గెలుపు కోసం కమ్యూనిస్టు కార్యకర్తలపై కమలం పార్టీ ప్రేమ కురిపిస్తుంది. ఎందుకంటే మునుగోడులో కమ్యూనిస్టులకు కొంత బలం ఉంది…గతంలో ఇక్కడ సి‌పి‌ఐ చాలా సార్లు సత్తా చాటింది.

అందుకే ఇప్పుడు కమ్యూనిస్టు ఓటర్లని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి…ప్రధాన పార్టీలు. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అదే పనిలో ఉన్నాయి. ఇక కమలం సైతం..కమ్యూనిస్ట్ మద్ధతుదారులని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…కమ్యూనిస్టు నేతలపై విమర్శలు చేస్తున్నారు…కానీ కార్యకర్తలని మాత్రం పొగుడుతున్నారు. తాజాగా  మునుగోడులో పాదయాత్ర చేస్తున్న బండి… సీఎం కేసీఆర్‌ వేసే కుక్క బిస్కెట్లకు కమ్యూనిస్టు పార్టీలు ఆశ పడతాయని, అవి చిల్లర పార్టీలని, దమ్ముంటే మునుగోడులో ఆ పార్టీలు పోటీ చేయాలని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే.

అదే సమయంలో కమ్యూనిస్టు కార్యకర్తలు మంచోళ్లే కానీ.. లీడర్లే అమ్ముడుపోయేటోళ్లు…టీఆర్‌ఎస్‌ ఇచ్చే పైసలకు ఆశపడి సీపీఐ నేతలు అప్పుడే పొత్తుకు సిద్ధమయ్యారని తాజాగా మాట్లాడారు. అంటే కమ్యూనిస్టు కార్యకర్తలని దగ్గర చేసుకుంటే…గెలుపు ఈజీ అని బీజేపీకి కూడా అర్ధమైనట్లు ఉంది..అందుకే కమ్యూనిస్టు కార్యకర్తలపై ప్రేమ కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే బండి సవాల్ తో పోటీ చేయాలో లేక పొత్తు పెట్టుకోవాలో తెలియక కమ్యూనిస్టులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో వారు పొత్తు వైపే మొగ్గు చూపేలా ఉన్నారు…టీఆర్ఎస్ తోనే కలిసి ముందుకెళ్లెలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news