టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా అందమైన జంట ఏది అంటే గుర్తుకు వచ్చేది.. అక్కినేని నాగచైతన్య- సమంత అనే చెబుతారు. కానీ ఆరు నెలల కిందట.. తమ వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించేశారు. ఇక విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది సమంత.
ఇది ఇలా ఉండగా తాజాగా నాగచైతన్య సమంతతో లవ్ మ్యారేజ్ కంటే ముందు తనకు లవ్ స్టోరీ ఉందని ఇంటర్వ్యూలో చెప్పాడు. అదికూడా ఆయన కాలేజీ రోజులలో నట. ఒకానొక సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డానని సీక్రెట్స్ బయట పెట్టాడు నాగచైతన్య.
కారు వెనుక సీట్లో తన గర్ల్ ఫ్రెండ్ కు ముద్దు పెడుతుండగా పోలీసులకు దొరికిపోయానని వివరించాడు. అయితే అదేమీ తనకు తప్పుగా అనిపించలేదని.. తాను చేసేది తనకు తెలుసని చెప్పుకొచ్చారు నాగచైతన్య. ప్రస్తుతం నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.