అంబటి రాంబాబుపై బండ్ల గణేష్ ఫైర్..రంభల రాంబాబు అంటూ !

-

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల వేదికలపై మాట్లాడిన స్పీచులు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడైతే రాజకీయాల్లోకి మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. రాజకీయాల్లోకి దిగి.. కోటలు దాటే మాటలతో నవ్వుల పాలయ్యాడు. బండ్ల గణేష్ కాస్తా.. బ్లేడ్ గణేష్ అనే స్థాయికి దిగజారిపోయాడు. అదంతా కాసేపు పక్కకు పెడితే.. ఏపీ మంత్రి అంబటి రాంబాబు పై బండ్ల గణేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చేనేత దినోత్సవం రోజున.. కాటాన్‌ దుస్తులు ధరించాలని పవన్‌ కళ్యాణ్‌ ఛాలెంజులు విసిరిన సంగతి తెలిసిందే. అయితే… ఆ ఛాలెంజులకు కౌంటర్‌ గా అంబటి రాంబాబు సెటైర్‌ వేశారు.

కాటన్ దుస్తుల ఛాలెంజ్లు ఆపి 175 సీట్లకి పోటీ చేస్తున్నారా! లేదా? ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించండి అంటూ పవన్‌ కళ్యాణ్‌ కు చురకలు అంటించారు. అయితే.. రాంబాబు ట్వీట్‌ కు బండ్ల గణేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. అలాగే రంభల రాంబాబు గారు మా సారు త్వరలో మీకు సమాధానం చెబుతారంటూ రివర్స్‌ అటాక్‌ చేశారు బండ్ల గణేష్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news