బాలయ్య చెల్లితో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన నటుడు సతీష్..!

-

గతంలో తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన మాజీ తమిళ హీరోయిన్ నటి సీతా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈమె ఓవర్ ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ తన సెంటిమెంటల్ ఓరియంటల్ సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసేది. సీత తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ముద్దుల మామయ్య చిత్రంలో హీరో చెల్లెలు పాత్రలో నటించి తన సెంటిమెంటల్ పాత్రలతో మరొకసారి టాలీవుడ్ సినిమా ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక అప్పటినుంచి అందరూ ఈమెను బాలయ్య చెల్లెలు అని పిలవడం మొదలుపెట్టారు. ఇక అందుకే సీత ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలలోని నటిస్తూ మరింత ఇమేజ్ను సొంతం చేసుకుంది.

ఇకపోతే ప్రతి ఒక్కరు కూడా సినిమాలపరంగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నట్టుగానే.. వ్యక్తిగత విషయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాంటి వారిలో సీతా కూడా ఒకరు. ఈమె రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో పాటు లవ్ ఫెయిల్యూర్ అంటూ తప్పుడు ప్రచారాలను కూడా ఎదుర్కొంది. తాజాగా ప్రముఖ తమిళ సీరియల్ నటుడు సతీష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సంబంధం గురించి తప్పుడు ప్రచారాల గురించి స్పందించారు.. సతీష్ మాట్లాడుతూ నటి సీతతో తనకు మంచి సన్నిహిత బంధం ఉందని, అది చూసి కొంతమంది ఓర్వలేక ఇలా తప్పుడు ప్రచారాలు చేశారు అని సతీష్ తెలిపారు.mavayya-annapilupu-Muddula_Mavayya_Song_3-384x216.jpg

ఇక ఈ క్రమంలోనే నటి సీత తనను వివాహం చేసుకుందని, లవ్ ఎఫైర్ కూడా నడిపిందని.. ఇంకొంతమంది అయితే ఏకంగా సహజీవనం కూడా చేసినట్లు ప్రచారాలు చేశారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు.. ఒక నటి కష్ట పరిస్థితులను అనుభవిస్తున్నప్పుడు తనకు అండగా ఉండి సహాయం చేశాను.. దాంతో మా మధ్య ఉన్నటువంటి అనుబంధం మరింత పెరిగిందని.. అంతేతప్ప అందులో అనుమానించేంత సంబంధం ఏమీ లేదు అని ఆయన వెల్లడించారు. ఇక అంతే కాదు ఇలా వార్తలు వైరల్ అవ్వడంతో మొదటి భార్య విడాకులు కూడా ఇచ్చింది అని, ఇక పిల్లలు కూడా మాజీ భార్య దగ్గరే పెరుగుతున్నారు అని స్పష్టం చేశారు. కష్టకాలంలో ఎవరికైనా దగ్గరైతే తప్పుడు బంధంతో వారిని ఇబ్బంది పెట్టవద్దు అంటూ సతీష్ మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news