అవంతి మళ్ళీ రూట్ మారుస్తారా?

-

మూడు ఎన్నికలు…మూడు పార్టీలు..మూడు విజయాలు ఇది మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజకీయ చరిత్ర. అవంతి విద్యాసంస్థలు నడిపే ముత్తంశెట్టి శ్రీనివాస్ కాస్త..అవంతి శ్రీనివాస్ గా మారి…2009లో రాజకీయాల్లోకి వచ్చారు. తన రాజకీయ సన్నిహితుడు గంటా శ్రీనివాస్ తో పాటు ప్రజారాజ్యంలో చేరారు. 2009లో భీమిలి అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం అందుకున్నారు..ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో అవంతి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు.

ఇక 2014 ఎన్నికల ముందు గంటాతో కలిసి టీడీపీలోకి వచ్చారు. కానీ అప్పుడు గంటా భీమిలి సీటు తీసుకోవడంతో, అవంతి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఐదేళ్ల పాటు టీడీపీలో ఎంపీగా పనిచేశారు. మరీ 2019 ఎన్నికల ముందు వైసీపీ వేవ్ ని గమనించి ఉంటారు…అందుకే ఆయన టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చారు. గంటాతో సంబంధం లేకుండా పార్టీ మారిపోయారు. వైసీపీలో చేరడమే ఆలస్యం…భీమిలి సీటు తీసుకున్నారు.

ఇక అప్పటివరకు భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న గంటా.. విశాఖ నార్త్ సీటుకు వచ్చేశారు. ఆయన టీడీపీలోనే పోటీ చేసి గెలిచారు. అవంతి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇలా గెలిచిన అవంతి…మంత్రి కూడా అయ్యారు. మంత్రిగా అవంతి పెద్దగా పేరు తెచ్చుకోలేదు..ఆ తర్వాత పదవి పోవడంతో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. అయితే అవంతికి భీమిలిలో ఇప్పుడు అంత అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. ఆయనపై వ్యతిరేకత ఉందని కథనాలు వస్తున్నాయి.

ఇక ఇప్పటివరకు వరుసగా విజయాలు సాధిస్తున్న అవంతికి ఈ సారి బ్రేక్ పడుతుందని అంటున్నారు. మరి ఇలాంటి తరుణంలో అవంతి మళ్ళీ పార్టీ మారతారా? అనే చర్చ కూడా జరుగుతుంది. కానీ జగన్…మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు కాబట్టి ఆయన పార్టీ మారే అవకాశాలు కనిపించడం లేదు. కానీ నెక్స్ట్ వైసీపీ నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయి..పైగా టీడీపీ-జనసేన పొత్తు ఉండొచ్చని తెలుస్తోంది…పొత్తు ఉండి…భీమిలి సీటు ఎవరికి దక్కినా సరే అవంతి గెలుపు గగనమే.

Read more RELATED
Recommended to you

Latest news