కేసీఆర్.. ప్రధాని మోడీ నీకు శత్రువు కావచ్చు.. కానీ ప్రజలకు మిత్రుడు : విజయశాంతి

-

బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ సమరభేరి పేరిట నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభలో బీజేపీ నాయకురాలు విజయశాంతి దిమాక్ ఉన్నోళ్లెవరూ సీఎం కేసీఆర్ ను సపోర్ట్ చేయరని అన్నారు. ‘కేసీఆర్.. ప్రధాని మోడీ నీకు శత్రువు కావచ్చు.. కానీ దేశ ప్రజలందరికీ ఆయన నమ్మదగిన మిత్రుడు’ అని ఆమె వ్యాఖ్యానించారు. మునుగోడులో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో మాట్లాడారు విజయశాంతి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్న విజయశాంతి.. ఇందుకుగానూ ఆయనకు అభినందనలు తెలిపారు. దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేయకుండా.. తెలంగాణ అమరవీరుల కలలను తుంగలో తొక్కిన కేసీఆర్ ను ప్రజలు సమర్ధించాల్సిన అసవరం ఏముందని ప్రశ్నించారు విజయశాంతి.

‘‘ రాష్ట్ర ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వనందుకు .. కేసీఆర్ ను సమర్ధించాలా ? కాళేశ్వరం ప్రాజెక్టును స్క్రాప్ గా మిగిల్చి.. వేల కోట్ల డబ్బులన్నీ జేబులో వేసుకున్నందుకు కేసీఆర్ ను సమర్ధించాలా ? గురుకుల పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యత లేని అన్నం పెడుతున్నందుకు కేసీఆర్ ను సమర్ధించాలా ? ’’ అని విజయశాంతి ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘భయంలేని వాడివే అయితే పదేపదే సీబీఐ, ఈడీని ఎందుకు కలవరిస్తున్నావు కేసీఆర్.. తప్పు చేసిన వాళ్లే భయపడతారు.. తప్పు చేశాడు కాబట్టే కేసీఆర్ భయపడుతున్నాడు’’ అని కామెంట్ చేశారు విజయశాంతి.

 

Read more RELATED
Recommended to you

Latest news