తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది : కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

-

బహిరంగ సభలు, పాదయాత్రలో మనుగోడులో రాజకీయ సందడి నెలకొంది. ఇప్పటికే మునుగోడులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ సమరభేరి పేరిట నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభలో అమిత్‌ షా పాల్గొన్నారు. అమిత్‌ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీ చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం మోసకారి, దగాకోరు, నయవంచక కుటుంబం చేతిలో చిక్కి విలవిల్లాడుతోందని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజల మీద విశ్వాసంతోనే పదవికి రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

గెలిపించిన ప్రజలకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యుద్దం జరుగుతోందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నిక వ్యక్తుల మధ్య జరిగే యుద్ధం కాదని, కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చి టీఆర్ఎస్ ను బొందపెట్టాలని పిలుపునిచ్చారు రాజగోపాల్ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news