ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇది తీసుకోవడం వల్ల దీర్ఘాకాలిక రోగాలైన ముధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు నయం అవుతాయని రుషులు అప్పుడే చెప్పారు. ఇంకా ఎన్నో ప్రయోనాలు కూడా ఉన్నాయి. అయితే ఏదైనా అతి చేస్తే అది కొంపముంచుతుందని మనందరికి తెలుసు. అలాగే ఈ త్రిఫల చూర్ణం కూడా ఎక్కువగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయట.. అవేంటంటే..
త్రిఫల చూర్ణం ఎలా చేస్తారు..?
ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలతో త్రిఫల చూర్ణం (Triphala Powder) తయారు చేస్తారు. ఈ ఆయుర్వేద మూలికా మెడిసిన్ వాడితే మలబద్ధకం, కంటి సంబంధ సమస్యలు, జుట్టు రాలటం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, రక్తపోటు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. కడుపులో నులిపురుగులు కూడా త్రిఫల చూర్ణం పోగొడుతుంది.
ఆయుర్వేదంలో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలను ఎన్నో ఔషధ గుణాలున్న రసాయనాలుగా చెప్తుంటారు. ఈ రసాయనాలు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మలబద్ధకం, మతిమరుపు వంటి సమస్యలను దరి చేరనివ్వవు. అయితే ఈ మూడు ఫలాలతో తయారు చేసిన త్రిఫల వాడే ముందు, దానిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తి ఒక రోజులో 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము కంటే ఎక్కువగా త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. త్రిఫల వాడే వారు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలండోయ్..!
త్రిఫల చూర్ణంలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి… ఈ చూర్ణం మధుమేహం రాకుండా సమర్థవంతంగా పోరాడుతుంది. అయితే మధుమేహం మందులు వాడుతున్న వ్యక్తులు త్రిఫలాన్ని అధికంగా తీసుకుంటే… వారి రక్తంలోని చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పడిపోతాయి. ఎందుకంటే మధుమేహం మందులతో కలిపి త్రిఫల తీసుకోవడం ద్వారా హైపోగ్లైసీమియా వస్తుంది. మధుమేహ రోగులు త్రిఫల తీసుకునే ముందు వైద్యులను కచ్చితంగా సంప్రదించాలి. ఇందులో ఉండే సార్బిటాల్, మెంథాల్ అనేవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
వేరే మెడిసిన్స్ వాడేటప్పుడు త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని చెబుతారు. ఎందుకంటే త్రిఫల చూర్ణం అనేది వేరే మెడిసిన్స్ పని చేయకుండా అడ్డుకుంటుందట. త్రిఫల చూర్ణం.. సైటోక్రోమ్ P450 అనే ముఖ్యమైన కాలేయ ఎంజైమ్ పనితీరును కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా మోడ్రన్ మెడిసిన్ లేదా అల్లోపతిక్ మెడిసిన్ సరిగ్గా జీర్ణం కావడంలో సమస్యలను వస్తాయి. కేవలం అల్లోపతి మందులపై కాకుండా మిగతా మెడిసిన్స్ పై కూడా త్రిఫల ప్రభావం చూపిస్తుంది.
ఈ చూర్ణాన్ని మోతాదుకు మించి తీసుకుంటే విరేచనాలు, రక్త విరేచనాలు అవుతాయి. దీనికి విరుగుడుగా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. త్రిఫలలోని ఒకటైన కరక్కాయ గర్భిణీలలో అబార్షన్లకు దారితీస్తుంది. అందుకే గర్భవతులు దీనిని వాడే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.