మాపై దాడి జరిగితే….వాళ్ల ఇంటికి వెళ్లి కొడతామని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేశారు వైసిపి నేతలు, కార్యకర్తలు. అయితే.. వైసిపి కార్యకర్తల చర్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం చేశారు. ఈ రోజు కుప్పం చరిత్రలో ఒక చీకటి రోజు అని.. అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ధ్వంసం చెయ్యడం నీచమన్నారు.
వీధి కొక రౌడీని తయారు చేసి ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారని.. పోలీసులు సరిగా ఉండి ఉంటే అన్న క్యాంటీన్ ను ఇలా ద్వంసం చేసేవారా అని ఫైర్ అయ్యారు. ఎస్పీ ఎక్కడ ఉన్నాడు…..ఏం చేస్తున్నాడు… మా వాళ్లు కూడా దాడులకు దిగితే ఏం చేస్తారు… మీకు 60 వేల మంది పోలీసులు ఉంటే మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని హెచ్చరించారు.
పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నా దాడి చేశారు….మరి పోలీసులు ఏం చేస్తున్నారని… రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా….పోలీసులు ఉంది మాపై దాడులు చెయ్యడానికా? అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యరు. అన్న క్యాంటీన్ పై దాడి చేసిన వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లకుండా ఇంటికి తీసుకువెళతారా? మూడేళ్లుగా జరుగుతున్న గ్రానైట్ అక్రమాలను ప్రశ్నించి అడ్డుకున్నాం…..బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నామని పేర్కొన్నారు చంద్రబాబు. అన్నం పెట్టే వాడిపై చెయ్యి చేసుకోవడం నీచం…కన్నతల్లిపై దాడి చేసినట్లే… పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ పై దాడిని తీవ్రంగా తీసుకుంటున్నామని వార్నింగ్ ఇచ్చారు.