టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ జూనియర్ లైన్‌మెన్ పరీక్ష రద్దయింది. జులై 17న వెయ్యి పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. 181 మంది అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్, రాచకొండ పోలీసుల విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఘట్‌కేసర్ పరీక్ష కేంద్రంలో చరవాణితో ఓ అభ్యర్థి పట్టుబడినాడు. మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతూ అభ్యర్థి పట్టుబడటంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షలో తమకు సమాధానాలు చెబుతామని డబ్బులు తీసుకుని మోసం చేశారని అభ్యర్థి వాపోయాడు. రూ.లక్షలు తీసుకుని మోసం చేశారని కొందరు ఉద్యోగులపై అంబర్‌పేట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఇద్దరు ఏడీఈలతో సహా ఐదుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పాత్ర ఉన్న ఐదుగురు ఉద్యోగులను సస్పెన్షన్ చేశామని ఆ సంస్థ సీఎండీ తెలిపారు. త్వరలో కొత్త నోటిఫికేషన్ వెల్లడిస్తామని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ పేర్కొన్నారు.