గూగుల్ ఫొటోస్ లో మీ పిల్లల పిక్స్ సేవ్ చేస్తున్నారా…? అయితే జాగ్రత్త పడాల్సిందే..!

-

చాలా మంది తమ ఫొటోస్ ని గూగుల్ ఫొటోస్ లో సేవ్ చేసుకుంటూ వుంటారు. మీ పిల్లలు కూడా అలానే చేస్తుంటారా..? అయితే జాగ్రత్త. ఫొటోస్ ని సేవ్ చేసే విషయం లో నిర్లక్ష్యం పనికి రాదు. ప్రైవేట్ పిక్చర్స్‌‌ ని స్టోర్ చేస్తే మీ గూగుల్ అకౌంట్‌ను బ్లాక్ చేస్తారు.

మీ గూగుల్ అకౌంట్‌ను గూగుల్ పిల్లల లైంగిక వేధింపు మెటీరియల్ (CSAM) కింద బ్లాక్ చేసేస్తుంది అని గుర్తుంచుకోండి. అయితే దీనిపై అమెరికా అడ్మినిస్ట్రేషన్‌కు గూగుల్ క్లారిటీ ని కూడా ఇచ్చింది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో కి చెందిన అతను ప్రైవేట్ ఫోటోను తీసి డాక్టర్ కి చూపించాలనుకున్నాడు. దీనితో గూగుల్ వారి అకౌంట్లను బ్లాక్ చేసేసింది.

2020లో కూడా ఒక ఆర్టిస్ట్‌పై ఇలాంటి చర్యలే తీసుకోవడం జరిగింది. ఆటోమేటెడ్ డిటక్షన్‌ను, హ్యూమన్ రివ్యూను‌ గూగుల్ ఉపయోగిస్తుంది. దానితో కంటెంట్‌ను గుర్తించడం, తొలగించడం వంటివి చెయ్యచ్చు. హ్యాష్ మ్యాచింగ్ టెక్నాలజీని కూడా గూగుల్ వాడుతోంది. మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, ఆపిల్‌ కూడా వాడుతున్నారు.

అంతే కాకుండా గూగుల్‌ తో పాటు ఇతర కంపెనీలు కూడా ఈ విషయం పై కట్టుదిట్టం గానే వున్నాయి. పిల్లల లైంగిక వేధింపు మెటీరియల్‌ను తగ్గించేందుకు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతోంది. కానీ ఇటువంటి వాటిని గుర్తించి తొలగించడం అనేది సులభం కాదు. యూజర్ల ప్రైవసీ ని కాపాడుతూ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌ పై ఇలాంటి వాటిని తొలగించడం కష్టమే అంటోంది గూగుల్.

Read more RELATED
Recommended to you

Latest news