వినాయకుడి శరీర భాగాల గురించి.. తెలియని కొన్ని నిజాలు…!

-

వినాయకుడు అంటే విఘ్నాలు తొలగించే వాడు, కోర్కెలు నెరవేర్చడం తమకి తోడుగా ఉండమని ముందు పూజ వినాయకుడికే మనం చేస్తూ ఉంటాం. వినాయకుడు జీవిత చరిత్ర , ఆయన ఎదిగిన విధానం, తల్లి తండ్రుల పట్ల చూపించిన భక్తి శ్రద్దలు, గౌరవం అన్నీ ఎంతో మందికి ఆదర్శప్రాయం. అందుకే వినాయకుడి చవితిని భారత దేశంలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం.

 

భారత దేశంలో వినాయక చవితి నాడు చేసే సభారాలు అంబరాన్నంటే విధంగా ఉంటాయి. అయితేఇంతమంది ఎంతో ఇష్టంగా కొలిచే వినాయకుడి శరీర భాగాలు ప్రపంచానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తాయో మీలో ఎంతమందికి తెలుసు. మనం వినాయకుడిని చూడగానే తల పెద్దగా ఉండి, ఏనుగుని పోలి ఉంటుంది. అలాగే శరీరం మనిషి ఆకృతి లో ఉంటుంది.

తల పెద్దగా ఉందంటే తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయనేది అర్థం. అలాగే తొండం ఓం ఆకారంలో ఎడమవైపుకి ఉంటుంది. అంటే సూర్యుని శక్తి ఎడమవైపుకి ప్రసరించి ఓర్పు ,సహనం, కలిగి ఉండేలా చేస్తుంది. అదే తొండం కుడి వైపుకి ఉంటే శరీరంలోకి శక్తి చేరి మోక్ష జ్ఞానం కలుగుతుంది.

 

ఒక చేతిలో ఆయుధం ఉన్న గొడ్డలి భందాలకి, నమ్మకాలకి సూచికగా ఉంటే, మరొక చేతిలో పద్మమం సత్యానికి ప్రతీక, మరొక చేతిలో లడ్డూ సంతోషానికి, ఇంకొక చెయ్యి అభాయానికి ప్రతీక.

అలాగే ఏక దంతం ప్రకృతిలో బిన్నత్వానికి ప్రతీక. అందరూ సమానమనే సూచికగా ఉంటుంది. విగ్నేస్వరుడి చిన్న కళ్ళు ఎకాగ్రతకి ప్రతీకగా ఉంటాయి. పెద్ద చెవులు శ్రద్దగా వినడానికి, చిన్న నోరు తక్కువగా మాట్లాడటానికి, పెద్ద పొట్ట సుఖాన్ని, దుక్ఖాన్ని సమానంగా తీసుకోవాలనే డానికి ప్రతీకలుగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news